Homeఆంధ్రప్రదేశ్పోలవరంక్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..

క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి దొంగగా మారిన యువకుడు..

 

అడ్డతీగల, పెన్ పవర్ ,ఏప్రియల్ 13: అడ్డతీగల మండలం పాపంపేట గ్రామ సమీపంలో ఆదివారం అడ్డతీగల సీఐ బి. నరసింహమూర్తి ఎస్సై వినోద్ వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఏలేశ్వరం గ్రామం దిబ్బల పాలెంకు చెందిన మజ్జి. శివప్రసాద్ అనే వ్యక్తి మోటార్ సైకిల్ ఆపి తనిఖీ చేసిన అనంతరం, అతనిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా పోలవరం జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో 13 ఇంటి దొంగతనాలు చేసినట్లు తనకు తానుగా ఒప్పుకున్నాడని అడ్డతీగల సీఐ బి. నరసింహమూర్తి తెలిపారు. ఇతను క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు పోగొట్టుకొని దీనితో దొంగగా అవతారం ఎత్తడని పోలీసులు తెలిపారు. ఉదయం సమయంలో తాళాలు వేయని ఇళ్లను, తాళాలు గుమ్మానికి తగిలించి ఉన్న ఇళ్లను ఎంచుకొని చాకచక్యంగా దొంగతనం చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇతని వద్ద నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 1,50,000 విలువ చేసే వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, ఇతనిని అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేస్టేట్ వద్ద హాజరపరుస్తామని పోలీసులు తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular