ePaper
Wednesday, May 20, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడగ్రామాల అభివృద్ధే లక్ష్యం!

గ్రామాల అభివృద్ధే లక్ష్యం!

📰 Generate e-Paper Clip

ప్రత్యేక అధికారిగా తహశీల్దార్ జి.ఆర్. ఠాగూర్ బాధ్యతల స్వీకారం

  1. కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 4: పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించింది.ఈ క్రమంలో కాజులూరు మండలంలో తహశీల్దార్/మండల మెజిస్ట్రేట్ జి.ఆర్. ఠాగూర్ శనివారం పల్లిపాలెం, కోలంక, దుగ్గుదూరు, బంధనపూడి గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఠాగూర్‌కు ఘన స్వాగతం లభించింది. కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ జి.ఆర్. ఠాగూర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కట్టుబడి పనిచేస్తానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి గ్రామానికి సరిపడా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అదనంగా, ప్రత్యేక అధికారులుగా రోజువారీ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ తమ బాధ్యతల్లో భాగమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్,సీహెచ్ రవికుమార్,పి.సుబ్బారాయుడు, వీఆర్వోలు జి. రాధాకృష్ణ, డేగల సుబ్రహ్మణ్యం,ధరణి,శ్రీపాదం సూరిబాబు, ఎం. శ్రీరాం, లోవరాజు, అలాగే కూటమి నాయకులు ప్రసాద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,రాయుడు కొండ, ఆదినారాయణ, కాదా బుజ్జి,రామకృష్ణ, దూడల శంకరనారాయణ, గుబ్బల నాగరాజు,సొసైటీ అధ్యక్షుడు బొండా నరసింహ నాయుడు, టీడీపీ నాయకులు సలాది సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.కాజులూరు మండలంలోని ఇతర గ్రామపంచాయతీ ల్లో కూడా మండల వ్యవసాయ అధికారి వి. అశోక్, ఎంఈవో-2 పి.జాన్ తదితరులు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగుతామని అధికారులు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular