ePaper
Tuesday, April 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడజర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

జర్నలిస్టుల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

అంబేద్కర్ అందరివాడు

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్‌ 14ః భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు కాజులూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని గొల్లపాలెం ధనలక్ష్మిపేటలో కాజులూరు మండల వర్కింగ్‌ జర్నలిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ ఆశయాలు, సమానత్వ సిద్దాంతాలు ప్రధానంగా ప్రతిధ్వనించాయి.మొదటగా జర్నలిస్టు అసోసియేషన్‌ అధ్యక్షులు వీరవల్లి గణపతి, దేవు మహేశ్వరరావులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసన గంగరాజు, అనుసూరి శ్రీను, పోతుల కిషోర్‌, దడాల ఏడుకొండలు , రెహమాన్, అత్తిలి వెంకటరమణ, కన్నా,తదితరులు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు.

ఈ సందర్భంగా టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు బొమ్మిడి సోమాలమ్మ ఆధ్వర్యంలో స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దడాల ఏడుకొండలు మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆలోచనలు దేశానికి దిశానిర్దేశం చేశాయని, సామాజిక న్యాయం, సమాన హక్కుల సాధనలో ఆయన పాత్ర అపారమని పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసి, వయోజనులకు ఓటు హక్కు, మహిళలకు సమాన హక్కులు కల్పించిన గొప్ప తత్వవేత్తగా కొనియాడారు.మండలంలోని శలపాక, గొల్లపాలెం, ఆర్యవటం, బంధనపూడి, చేదువాడ, దుగ్గుదుర్రు, జగన్నాధగిరి, కుయ్యేరు, కాజులూరు, ఉప్పుమిల్లి ,మంజేరు తదితర గ్రామాల్లో కూడా అంబేడ్కర్‌ జయంతి వేడుకలు విశేషంగా నిర్వహించారు. బి ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నీలి జెండాలతో పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు పలు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పల్లెపాలెం గ్రామ సభలో ప్రత్యేక అధికారి మండల మెజిస్ట్రేట్ జి ఆర్ ఠాగూర్ పాల్గొని పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.ఈ కార్యక్రమాల్లో మండల తహశీల్దార్‌ జి.ఆర్‌.ఠాగూర్‌, ఆర్‌ఐ వేగేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్‌ఐ మోహన్‌ కుమార్‌, ఎంపీపీ మాత భారతి మురళీ, ఏఎంసీ వైస్ చైర్మన్ దడాల నాగేశ్వరి నాగార్జున,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అంబేడ్కర్‌ వాదులు, యువకులు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అంబేడ్కర్‌ ఆశయాలను ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాల్గొన్నవారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular