ePaper
Wednesday, June 3, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుజీకే వీధిలో దంచికొట్టిన వడగళ్ల వర్షం

జీకే వీధిలో దంచికొట్టిన వడగళ్ల వర్షం

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 18: మండలంలో శనివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా వాతావరణం మారి వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, అనంతరం నల్లని మబ్బులు కమ్ముకుని ఈదురుగాలులతో పాటు వర్షం ప్రారంభమైంది.జీకే వీధి, ఆర్వి నగర్, డేరాలు, కొత్తూరు, పూజారిపాకలు, వంచుల పంచాయతీ వీరవరం గ్రామాల్లో సుమారు మూడు గంటలపాటు వర్షం కురవడంతో జనజీవనం స్థంభించింది.వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రాకపోకలు మందగించాయి.ఈ ఆకస్మిక వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular