Homeఆంధ్రప్రదేశ్కాకినాడపల్లిపాలెం సర్పంచ్ బరిలో పంపన నాగమణి

పల్లిపాలెం సర్పంచ్ బరిలో పంపన నాగమణి

అభివృద్ధి హామీలతో ముమ్మర ప్రచారం

కాజులూరు, పెన్ పవర్, నవంబర్ 23: కాజులూరు మండల పరిధిలోని పల్లిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పంపన నాగమణి బరిలో నిలిచారు. వైసీపీ నేతలు బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వైసీపీ నాయకులు కాజులూరి సిద్ధార్థరెడ్డి, శివారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీను తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు తనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు నాగమణి తెలిపారు.


గ్రామంలో ప్రధాన సమస్యలుగా ఉన్న బస్సు సౌకర్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఆమె పేర్కొన్నారు. గ్రామస్తులు తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే నాయకుల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా అందుబాటులో ఉంటూ వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, వారి అవసరాలను గుర్తించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని మీడియా ద్వారా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో పల్లిపాలెం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో నాగమణి అభ్యర్థిత్వం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular