ePaper
Thursday, April 16, 2026
ePaper
Homeతెలంగాణప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..

ప్రజావాణి ఫిర్యాదుకు..! స్పందించిన కలెక్టర్..

📰 Generate e-Paper Clip

ఆకుల సతిష్ టీమ్ కృషికి ఫలితం..! రూ.100 కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ..!

దుండిగల్‌ మండలం బౌరంపేట్ సర్వే నెం.166/1 ప్రభుత్వ భూవివాదం..

ఎక్స్ సర్వీస్ మెన్‌కు కేటాయించిన భూమి వివాదాస్పదంగా తయారైంది..

భూ కేటాయింపు ఒకచోట.. స్వాధీనం మరోచోట..దీంతో ఆకుల సతీష్ ఫిర్యాదు..

2024లో కబ్జాలో జీవన్‌రెడ్డి.. అదనపు కలెక్టర్ సందర్శించి చర్యలకు ఆదేశాలు..

2024 ఆగష్టు 7న దుండిగల్‌ తహశీల్దార్ ఆధ్వర్యంలో కబ్జాలు కూల్చివేత..

మళ్ళీ 2026లో అదే స్థలంలో మట్టినింపి చదునుపై.. ప్రజావాణి ఫిర్యాదు..

జారీచేసిన ప్రొసీడింగ్‌ను జిల్లా కలెక్టర్ రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ..

కలెక్టర్ ఆదేశాలతో సర్వే నెం.166/1 ఆక్రమిత భూమిలో తహశీల్దార్ బోర్డు..

ఎట్టకేలకు ఆక్రమిత ప్రభుత్వ భూమిలో దుండిగల్‌ రెవెన్యూ అధికారులు, నోటీసు బోర్డు పెట్టారు.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దుండిగల్‌ మండలం, బౌరంపేట్ గ్రామ పరిధిలోని, సర్వే నెంబర్ 166/1 భూమిని, 166/9/2 భూమిగా, 17-01-2026న జారీ చేసిన కలెక్టర్ ప్రొసీడింగ్ నెంబర్: A1/899/2024 పై, స్థానికుల‌ అభ్యంతరాల మేరకు..! మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌‌‌ ప్రజావాణి ఫిర్యాదు మేరకు.. కలెక్టర్ మను చౌదరి 13-04-2026న రద్దుచేస్తూ, బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.. సర్వే నెం.166/9/2 భూమిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, నిన్న సంబంధిత భూమిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు.. ప్రొసీడింగ్ నెంబర్.A1/899/2024 (తేదీ: 13-04-2026) ప్రకారం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ భూమిలోకి ప్రవేశాన్ని నిషేధించారు. దుండిగల్‌ తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి ఆద్వర్యంలో కలెక్టర్ ఆదేశాలను అమలు చేస్తూ.. నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు..

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 15:

మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌‌‌‌లో సమస్యలను, తక్షణ పరిష్కరం కోసం, వారం వారం నిర్వహిస్తున్న, ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఓ ఫిర్యాదుకు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి వెంటనే స్పందించారు.. రూ.100 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకుని బుధవారం తహశీల్దార్ ఆధ్వర్యంలో నోటీసు బోర్డును ఏర్పాటు చేశారు.. వివరాల్లోకి వెళ్ళితే.. అకుల సతీష్ అండ్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట్ సర్వే నెంబర్ 166/1, ఉన్న దాదాపు 5 ఎకరాలు, సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని.. ఎక్స్ సర్వీస్ మెన్‌ పట్టా పేరుతో అక్రమంగా ఆక్రమించి, దాన్ని సక్రమం చేసుకోవడానికి తప్పుడు ప్రొసీడింగ్ పొందిన విషయంపై, పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించామని, ఈ నేపథ్యంలో తమపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టిన జీవన్‌రెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆకుల సతీష్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ మేరకు సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్  ప్రజావాణిలో ఆధారాలతో ఫిర్యాదు చేయగా కలెక్టర్ వెంటనే స్పందించారని సతీష్ తెలిపారు..

ప్రొసీడింగ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు..

రూ.100 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై, ఆకుల సతీష్ ఫిర్యాదుకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ స్పందించారు.. కలెక్టర్ గతంలో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసి, ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచు కోవాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఈ  ఉత్తర్వుల మేరకు దుండిగల్ ఎమ్మార్వో తక్షణ చర్యలు తీసుకుని, సంబంధిత భూమిని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ బోర్డు ఏర్పాటు చేశారని సతీష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు… అదేవిధంగా కబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని దుర్వినియోగం చేసుకునేందుకు దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం వంటి చర్యలకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని స్పష్టం చేశారు.. ప్రభుత్వ భూములను కాపాడటం తమ ప్రధాన లక్ష్యమని అన్నారు..ఈ చర్యలలో భాగంగా తక్షణమే స్పందించిన కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular