–దుండిగల్‌లో ఇద్దరు అరెస్ట్.. పోక్సో కేసు నమోదు..
-ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఎ-1 బెదిరింపులతో లైంగిక దాడి..
-ఎ-2 అదే తరహాలో బాధిత మైనర్ బాలికను లైంగికంగా వేధింపులు..
-ఇద్దరు నిందితులను కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కి తరలింపు..
దుండిగల్, పెన్ పవర్, మే 20:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్టు పోలీసులు తెలిపారు.. ఈ పోక్సో కేసులో దుండిగల్ గ్రామం, నిజాంపేట్ గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులను, బాధితురాలు ఫిర్యాదు మేరకు, బుధవారం అదుపులోకి తీసుకున్న దుండిగల్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఎ-1 నిందితుడు, బాధితురాలిని ప్రేమ పేరుతో మోసం చేశాడని, అనంతరం బాలికకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు ఉన్నాయని బెదిరిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు తెలిపారు.. ఈ క్రమంలో అతని స్నేహితుడు ఏ-2 నిందితుడు, కూడా బాధిత బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.. బాలిక ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్లు 64(2)(ఎం), 351(2), 3(5)తో పాటు పోక్సో చట్టం 5(l), 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితుల్లో ఒకరిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది..

