అమరావతి పెన్ పవర్
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ప్రత్యేక సైబర్ టాస్క్ ఫోర్స్ న్ను ఏర్పాటు చేస్తోందని సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కేసులు నమోదు చేసి, సైబర్ షీట్స్ తెరుస్తామని హెచ్చరించారు. నకిలీ ఐడీలు (ఫేక్ అకౌంట్స్) ఉపయోగించి అనుచిత వ్యాఖ్యలు చేసినా వదలకుండా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై టాస్క్ ఫోర్స్ నిరంతరం గట్టి నిఘా ఉంచనుందని పోలీస్ శాఖ వెల్లడించింది.

