Homeక్రైమ్ న్యూస్చిన్నగంజాం హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

చిన్నగంజాం హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

  • ​బాపట్ల జిల్లా, చిన్నగంజాం పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో గొర్రెల దొడ్డి వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఇంకొల్లు సీ.ఐ రామానాయక్, చిన్నగంజాం ఎస్ఐ రమేష్‌ ఈ కేసును విచారించి ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular