విశాఖ షాప్‌లో చోరీ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్ – -కేసు ఛేదన లో సిటీ పోలీస్ లు సూపర్ కమిషనర్ గాజువాక :పెన్ పవర్ ,ఏప్రిల్ 16
విశాఖపట్నం సిటీ పరిధిలో జరిగిన షాప్ దొంగతనం కేసును దువ్వాడ క్రైమ్ పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో నగదు మరియు నేరానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాల పోలీస్ లు తెలిపిన వివరాలు ప్రకారం, కూర్మన్నపాలెం ప్రాంతంలో ఉన్న సచివ్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ ఏజెన్సీస్ అనే షాప్‌ను నడుపుతున్న అతికంశెట్టి పైడిరాజు తన షాప్‌ను ఏప్రిల్ 9 రాత్రి వ్యాపారం ముగిసిన తరువాత షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు అని , మరుసటి రోజు ఉదయం షాప్ తెరిచి చూడగా, పైకప్పు సిమెంట్ రేకులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు టేబుల్ డ్రాయర్‌ను పగలగొట్టి, బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి ఉంచిన సుమారు రూ. 2.75 లక్షల నగదును దొంగిలించినట్లు గుర్తించారని తెలిపారు . ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు ఏప్రిల్ 16న నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు .
గుర్రం అఖిల్ అలియాస్ మణికంట 32సం , తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి జిల్లా, సవరాల భాను ప్రకాష్ 28 సం . , సత్యసాయి జిల్లా కు చెందిన వారని .
నిందితుల వద్ద నుండి రూ. 2,52,500 నగదు, స్క్రూడ్రైవర్, కటింగ్ ప్లేయర్, రెంచ్ వంటి పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ,
విచారణలో నిందితులు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని ,ఈ కేసును త్వరితగతిన ఛేదించిన దువ్వాడ క్రైమ్ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.
ప్రజలు తమ ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలి, నగదు మరియు బంగారాన్ని ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇళ్లు, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని పోలీసులు సూచించారు.
విశాఖ షాప్‌లో చోరీ కేసు ఛేదన – ఇద్దరు నిందితులు అరెస్ట్
RELATED ARTICLES

