ఐదుగురు వ్యక్తుల అరెస్ట్
ఐదు సెల్ ఫోన్లు రెండు కార్లు స్వాధీనం
అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి
గంగవరం, పెన్ పవర్, ఏప్రిల్ 16:
గంజాయి అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అడ్డతీగల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి నరసింహమూర్తి గంగవరం ఎస్సై వెంకయ్య హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం గంగవరం మీదుగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంగవరం ఎస్ఐ వెంకయ్య తన సిబ్బందితో కలిసి గంగవరం గ్రామ శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో రెండు వాహనాలు రావడంతో పోలీస్ సిబ్బంది ని చూసి వాహనంలోని ఐదుగురు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అనంతరం వాహనాలను పరిశీలించగా ఐదు బస్తాలు తో గంజాయి ఉండడం గమనించడం జరిగిందన్నారు. మధ్యవర్తుల సమక్షంలో పంచనామా నిర్వహించగా ఐదు బస్తాల్లో 120 కేజీలు గంజాయి ఉండడం జరిగిందన్నారు. ఆ వాహనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారిలో నలుగురు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగాను ఒకరు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగిందన్నారు. వీరి వద్దనుండి 5 సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారు వివరించారు. గంజాయి అక్రమ రవాణా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వారు తెలిపారు.

