Homeఆంధ్రప్రదేశ్పోలవరంఎస్‌ఎస్‌సీ రిమీడియల్ తరగతుల్లో 100% హాజరు తప్పనిసరి

ఎస్‌ఎస్‌సీ రిమీడియల్ తరగతుల్లో 100% హాజరు తప్పనిసరి

ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు

రంపచోడవరం, పెన్ పవర్ మే 5:విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రత్యేక తరగతులను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు సూచించారు. మంగళవారం రంపచోడవరం
ప్రభుత్వ ఉన్నత ను జిల్లా విద్యాశాఖాధికారి (ఏజెన్సీ) వై. మల్లేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌సీ ప్రత్యేక రిమీడియల్ తరగతులను పరిశీలించారు.పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థుల్లో 9 మంది మాత్రమే హాజరైనట్లు ఆయన గమనించారు. హాజరు తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, రాబోయే రోజుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ తప్పనిసరిగా హాజరయ్యేలా 100 శాతం హాజరు సాధించాలని ప్రధానోపాధ్యాయుడికి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కేంద్రాలకు ఫెయిల్ అయిన విద్యార్థులు హాజరయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular