Homeతెలంగాణప్రమాదకర గుంత పూడ్చివేత.. వాహనదారులకు ఊరట

ప్రమాదకర గుంత పూడ్చివేత.. వాహనదారులకు ఊరట

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 11:

గార్ల మండల కేంద్రంలోని స్థానిక డోర్నకల్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలు పడటంతో ఎంతోమంది వాహనదారులు ప్రమాదాలకు గురై గాయాల పాలవుతున్నారు. మంగళవారం గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ గార్ల సబ్ ఇన్స్పెక్టర్ సాయికుమార్ లు పోలీసు సిబ్బందితో కలిసి గుంతను పూడ్చివేయడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు కొంత ఊరట లభించింది ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదకర గుంతను పూడ్చి వేయడం పట్ల స్థానికులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు ఇదేవిధంగా గార్ల లోని ప్రధాన రహదారులపై ఉన్న ఇతర గుంతలను కూడా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు గుర్తించి శాశ్వతంగా మరమ్మత్తులు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గార్ల పోలీస్ సిబ్బంది శ్యాం హనుమంతు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular