Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పాటు

నర్సీపట్నం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పాటు

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సేవా ట్రస్ట్ కు నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవము ఆదివారం సాయంత్రం వాసవి మాత ఆలయంలో అట్టహాసంగా జరిగింది. 2026 – 28 సంవత్సరములకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా  దేవత కామేశ్వరరావు, కార్యదర్శిగా గ్రంధి మురళీకృష్ణ, కోశాధికారిగా ఉద్దగిరి రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కో ఆప్షన్ సభ్యులుగా వూకా నాగేశ్వరరావు, సుతాపల్లి శ్రీకాంత్ మరియు ఎలమర్తి సాంబశివరావు లను నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కామేశ్వరరావు మాట్లాడుతూ నూతన కమిటీ సహకారంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తొమ్మిది మంది మహిళలతో నవశక్తి సేవా కమిటీని నియమించి పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సీపట్నంలోని అన్ని సంఘాల సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి ఆర్యవైశ్య ప్రముఖులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular