ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకేజీహెచ్‌లో గాయపడిన బాధితులను పరామర్శించిన డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు

కేజీహెచ్‌లో గాయపడిన బాధితులను పరామర్శించిన డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూన్ 4: రోడ్డు ప్రమాదాల్లో గాయపడి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలానికి చెందిన పలువురు బాధితులను ఆంధ్ర వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పసుపులేటి లక్ష్మణరావు గురువారం పరామర్శించారు. మండలంలోని ఎర్రవరం గ్రామానికి చెందిన కొర్ర బాబూరావు బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుండగా, గైనిక్ వార్డులో చికిత్స పొందుతున్న చింతపల్లి గ్రామానికి చెందిన కొర్ర వెంకటలక్ష్మిని, అలాగే శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న ఎర్రవరం గ్రామానికి చెందిన తాడి రమేష్, రింతాడ గ్రామానికి చెందిన బుజ్జిబాబులను ఆయన ట్రైబల్ సెల్ సిబ్బందితో కలిసి పరామర్శించారు.బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న డాక్టర్ లక్ష్మణరావు, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఉద్యోగి దొండ సత్యనారాయణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular