Homeతెలంగాణహైదరాబాద్డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి

డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి

 

డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి

 హైదరాబాద్ పెన్ పవర్ జూన్ 17:

 

ఎబివిపి ఆధ్వర్యంలో పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహించారు . ధర్నాలో ఎబివిపి సిటీ కళాశాల అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కావొస్తున్న విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది అన్నారు. పాఠశాలు ప్రారంభం అయినా విద్యార్థులకు అందాల్సిన పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందలేదు అని మండిపడ్డారు. ప్రవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, కనుక ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది అన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మార్చుకోకపోతే,రానున్న రోజుల్లో ఎబివిపి కాంగ్రెస్ సర్కార్ కు తగిన బుద్ధి చెబుతుంది అని మీడియాకు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular