Homeతెలంగాణహైదరాబాద్టి.ఐ.సి.సి.ఐ గ్రేటర్ కో-ఆర్డినేటర్‌గా బి. ప్రభాకర్

టి.ఐ.సి.సి.ఐ గ్రేటర్ కో-ఆర్డినేటర్‌గా బి. ప్రభాకర్

ఎల్బీనగర్, పెన్ పవర్, జూలై 26:

ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (టి.ఐ.సి.సి.ఐ ) తెలంగాణ చాప్టర్ గ్రేటర్ హైదరాబాద్ కో-ఆర్డినేటర్‌గా బి. ప్రభాకర్ ను నియమితులైనట్లు టి.ఐ.సి.సి.ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు డా. శ్రీనివాస్ ధారావత్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గిరిజన పారిశ్రామికవేత్తలు, యువత, వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులను ఒకే వేదిక పై తీసుకువచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పారిశ్రామిక పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ఎం.ఎస్‌.ఎం.ఈ, స్టార్టప్ ఇండియా, పీ.ఎం.ఈ.జీ.పీ, స్టాండ్-అప్ ఇండియా, ఎన్‌.ఎస్‌.ఐ.సీ, సి.డ్బీ వంటి పథకాల ప్రయోజనాలు మరింత మందికి చేరేలా బి.ప్రభాకర్ కృషి చేస్తారని డా. శ్రీనివాస్ ధారావత్ తెలిపారు. ఈ సందర్భంగా బి.ప్రభాకర్ మాట్లాడుతూ, టి.ఐ.సి.సి.ఐ ఆశయాలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో సభ్యత్వ విస్తరణ, పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం, వ్యాపార నెట్‌వర్కింగ్, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను గిరిజన యువతకు చేరవేయడానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నియామకం ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో టి.ఐ.సి.సి.ఐ కార్యకలాపాలు మరింత బలోపేతం కావడంతో పాటు గిరిజన పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సంస్థ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular