Homeతెలంగాణహైదరాబాద్విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీల గుర్తింపు రద్దు

విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీల గుర్తింపు రద్దు

తెలంగాణ : ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తే ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి హెచ్చరించింది. విద్యార్థులు కోరిన వెంటనే టీసీ, కండక్ట్, బోనాఫైడ్ తదితర సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించింది. ఫీజు వివాదాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలే తప్ప విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీయొద్దని స్పష్టం చేసింది.

ఆదేశాలు ఉల్లంఘించిన కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, అవసరమైతే అనుబంధ గుర్తింపు రద్దు లేదా మూసివేత చర్యలు తీసుకుంటామని బోర్డు వెల్లడించింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular