శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వాసంశెట్టి సుభాష్
– భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మీడియా ప్రతినిధులు
కాజులూరు, పెన్ పవర్,జూన్ 10: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) సత్యంబాబు జన్మదిన వేడుకలు కాజులూరు మండలం గొల్లపాలెంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి సత్యంబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రి సుభాష్ స్వయంగా కేక్ కట్ చేసి సత్యంబాబుకు తినిపించి శుభాకాంక్షలు అందజేశారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న సత్యంబాబు మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాల ప్రచారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవలను పలువురు నాయకులు కొనియాడారు.అనంతరం కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు సత్యంబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, యువత పెద్ద సంఖ్యలో ఓటరుగా నమోదు కావాలని కోరారు.అలాగే గత రెండేళ్లలో రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు రూ.250 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, కాజులూరు మండలానికే దాదాపు రూ.60 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. రానున్న పుష్కరాల కోసం మరో రూ.150 కోట్ల నిధులు మంజూరుకానున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి,కోట తాతబ్బాయి, చుండ్రు వీర్రాజు చౌదరి, బొమ్మిడి సోమాలమ్మ, పలివెల రాజు, ఆకుల సతీష్,వల్లు అర్జున్ రావు ఏఎంసీ డైరెక్టర్,పితాని సతీష్ కుమార్, అంగర కృష్ణ, కోమలి వెంకట రమణ, గోపి, జల్లి సత్య నారాయణ, దడాల నాగార్జున, కలిదిండి కొండబాబు (ల్యాండ్రీ షాపు)మీడియా ప్రతినిధులు పెన్ పవర్ కాకినాడ జిల్లా స్టాఫ్ రిపోర్టర్, కాజులూరు మండలం వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ జనరల్ సెక్రెటరీ దడాల ఏడుకొండలు, అధ్యక్షులు వీరవల్లి గనపతి,దేవు మహేశ్వరరావు, అత్తిలి వెంకటరమణ,అనుసూరి శ్రీను,కేసన గంగరాజు, పోతుల కిషోర్,
తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. క్లస్టర్, కో-క్లస్టర్, బూత్ ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
