ePaper
Saturday, June 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లినాతవరంలో 30 కేజీలు గంజాయి స్వాధీనం

నాతవరంలో 30 కేజీలు గంజాయి స్వాధీనం

📰 Generate e-Paper Clip

నలుగురు స్మగర్ల అరెస్ట్….

కారు, బైక్, రెండు సెల్ ఫోన్లు సీజ్

నర్సీపట్నం, పెన్ పవర్ :

నాతవరం మండలం బెన్నవరం శివారులో 30 కేజీల గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం డీఎస్పీ పీ.శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు నాతవరం ఎస్సై వై. తారకేశ్వరరావు, సిబ్బంది మండలంలోని బెన్నవరం గ్రామ శివారు వద్ద మాటు వేసి ఈ గంజాయిని పట్టుకున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన రామాని రాజేష్ హైదరాబాద్లో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. భీమవరంలో ఐటీఐ చదివాడు. విద్యార్థి దశలోనే గంజాయి సేవించే అలవాటు ఉంది. హైదరాబాద్లో ఉండగా గంజాయి తాగడం కోసం చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని కొనుగోలు చేసేవాడు. తర్వాత ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి వ్యాపారం చేయాలని ఆలోచన రావడంతో ఏ2 పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రుద్రరాజు దినేష్ వర్మతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని మల్కన్ గిరి జిల్లా పప్పులూరు(పటేల్) గ్రామానికి వెళ్లి 6 కేజీల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకువెళ్లాడు.

అక్కడ కొంత గంజాయిని చిన్న ప్యాకెట్లుగా విక్రయించగా ఏ1, ఏ2లు వినియోగించుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 9న ఏ1 రాజేష్ తన స్నేహితులు అయిన ఏ3 షేక్ షయాoభాషా, ఏ4 ముంగర సురేష్, ఏ2 దినేష్ వర్మ లతో కలిసి భీమవరానికి వచ్చాడు. ఏ1 హైదరాబాద్ లో తనఖ ద్వారా ఒక ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. వీరు కూడా అద్దెకు ఒక కారును తీసుకున్నారు. ఏ3, ఏ4లను ద్విచక్ర వాహనంపై, రాజేష్, దినేష్ కారులో వెళ్లారు. కేజీ 2వేల చొప్పున మొత్తం 30 కేజీల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొని వెళ్లి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముకొని అందరూ సమానంగా పంచుకుందామని అనుకోని ఈ నెల 12న రాత్రి పటేల్ గ్రామం నుంచి దారకొండ, ఆర్వీనగర్, రింతాడ, గోకవరం, రాజమండ్రి, భీమవరం జాతీయ రహదారి ద్వారా వెళ్లే క్రమంలో నాతవరం మండలం బెన్నవరం గ్రామ శివారు వద్ద పట్టుబడ్డారన్నారు. ఈ నలుగురు నిందితులను అరెస్టు చేసి ఒక బైక్, ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నాతవరం ఎస్పై వై. తారకేశ్వరరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, నాతవరం ఎస్సై తారకేశ్వరరావు, నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular