గార్ల, పెన్ పవర్, జూలై 28:
వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల పైగా కావస్తున్న రైతులకు సరిపడా ఎరువులను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించి మండల వ్యవసాయ అధికారి రామారావు కు వినతి పత్రం అందజేశారు అనంతరం ఈ సందర్భంగా కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎరువుల ధరలను తగ్గించి రైతుల కు ఎరువులను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. దేశానికి రైతే వెన్నెముకగా పేరొందిన భారతదేశంలో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు ఘోర విఫలం చెందాయన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి సరసమైన ధరలకు ఎరువులను అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సమితి సభ్యులు భూక్య హరినాయక్, మెదరమెట్ల గిరిప్రసాద్, లావుడియా భీముడు, బాదం రాజేష్,రవి తదితరులు పాల్గొన్నారు.

