Homeతెలంగాణనిరంతర విద్యుత్ సరఫరాకు టవర్ లైన్ ఏర్పాటు

నిరంతర విద్యుత్ సరఫరాకు టవర్ లైన్ ఏర్పాటు

 

గార్ల, పెన్ పవర్, జులై 28:

పాకాల ఏరు వరదల కారణంగా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో విద్యుత్ లైన్ మౌలిక సదుపాయాలు దెబ్బతిని మద్దివంచ పంచాయతీ గ్రామాలకు తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 7.6 లక్షల వ్యయంతో మహబూబాబాద్  జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక పాకాల ఏటి వద్ద నిర్మించిన 2 టవర్ లైన్ లను  మంగళవారం మహబూబాబాద్ డివిజన్ డివిజనల్ ఇంజనీర్ కోటేశ్వరరావు విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు టవర్ లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్‌ కష్టాలు తీరనున్నాయన్నారు గార్ల సెక్షన్ తో పాటుగా కొరివి సెక్షన్ పరిధిలోని పెద్ద తండా ఫీడర్ కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే అవకాశం కూడా కల్పించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ సర్పంచ్ వెంకట్ రావు, డిఈ టెక్నికల్ సేఫ్టీ ఆఫీసర్ హీరాలాల్, కురవి ఏ డీ ఈ రమేష్, గార్ల ఏ ఈ మధు, ఫోర్ మెన్ సాంబమూర్తి, ఏ ఎల్ ఎం సమద్, జేఎల్ఎం అయ్యూమ్ పాష, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular