Homeతెలంగాణహనుమకొండవిద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

గార్ల పెన్ పవర్ జులై 23:

విద్యార్థుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బానోత్ హరిప్రియ నాయక్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కు అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదని ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు సమిష్టి కార్యాచరణ అవసరమని పేర్కొన్న ఆమె, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి రాజకీయ పార్టీ, ప్రజా సంఘం, విద్యావేత్త, మేధావి బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల హక్కుల సాధనలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ నెల 25వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో గల కమ్మవారి కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం నిర్వహిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు పాల్గొంటున్నారని తెలిపారు.ఇల్లందు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular