Homeఆంధ్రప్రదేశ్కాకినాడభారీ కాన్వాయ్‌తో అమలాపురం చేరిన ఎన్ఆర్ఐ డాక్టర్ డేగల నాగేంద్ర

భారీ కాన్వాయ్‌తో అమలాపురం చేరిన ఎన్ఆర్ఐ డాక్టర్ డేగల నాగేంద్ర

రామచంద్రపురం జనసేన ఇన్‌చార్జి పదవికి దరఖాస్తు

జనసేన జెండాలతో భారీగా తరలివచ్చిన మద్దతుదారులు

కాజులూరు, పెన్ పవర్ జూలై 3: జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ, పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కాజులూరు మండలం నుంచి ఎన్ఆర్ఐ డాక్టర్ డేగల నాగేంద్ర తన మిత్రబృందం, అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్‌తో అమలాపురం చేరుకుని దరఖాస్తు సమర్పించారు.జనసేన పార్టీ జెండాలతో అలంకరించిన వాహనాల కాన్వాయ్‌లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడంతో అమలాపురం కేంద్రం వద్ద సందడి నెలకొంది. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కేంద్రానికి చేరుకున్న డాక్టర్ నాగేంద్ర తన దరఖాస్తును అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు అందజేశారు.
కాజులూరు మండలం బందనపూడి గ్రామ మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణి సత్యనారాయణ కుమారుడైన డాక్టర్ నాగేంద్ర, రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పదవికి దరఖాస్తు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పిస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.అమలాపురంలో నిర్వహించిన ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ పరిధి నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి తమ దరఖాస్తులను సమర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular