Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంమోకాళ్లపై నడిచి ఆందోళన..

మోకాళ్లపై నడిచి ఆందోళన..

విశాఖ పోర్టు కాలుష్యంపై వైసీపీ నిరసన

మోకాళ్లపై నడిచి ఆందోళన..

ప్రభుత్వంపై వాసుపల్లి గణేష్ కుమార్ విమర్శలు

బ్యూరో రిపోర్ట్  పెన్ పవర్ విశాఖపట్నం , జూలై 03  :

విశాఖ పోర్టు నుంచి వెలువడుతున్న కాలుష్యంతో దక్షిణ నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జగదంబ జంక్షన్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నేతలు, కార్యకర్తలు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. కాలుష్య ప్రభావంతో బాధపడుతున్న రోగులను ప్రతిబింబించేలా వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి, బాధితుల ఫొటోలు ప్రదర్శిస్తూ ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, విశాఖ పోర్టు కాలుష్యం కారణంగా కోటవీధి, అంబుసారంగ వీధి, లక్ష్మీ టాకీస్ ప్రాంతం, కొబ్బరితోట, ప్రసాద్ గార్డెన్, అంబేద్కర్ కాలనీ, భూపేష్ నగర్, లక్ష్మీదేవిపేట, అల్లిపురం, జ్ఞానాపురం, కంచరపాలెం తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాలుష్య నియంత్రణ కోసం పది మీటర్ల ఎత్తైన ఐరెస్ వాల్ నిర్మించడం, లక్షలాది మొక్కలు నాటడం, నీటి ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నిరంతర నీటి చల్లడం వంటి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చర్యలు కొనసాగకపోవడంతో కాలుష్యం మళ్లీ పెరిగిందని ఆరోపించారు.

పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ పోర్టు కాలుష్యంపై స్పందించి బాధిత ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని డిమాండ్ చేశారు. పోర్టు కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీతో పాటు పలువురు వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular