Homeస్పోర్ట్స్కోరమాండల్   పరిసర గ్రామాల క్రికెట్ జట్లకు రూ.5 లక్షల విలువైన కిట్ల పంపిణీ

కోరమాండల్   పరిసర గ్రామాల క్రికెట్ జట్లకు రూ.5 లక్షల విలువైన కిట్ల పంపిణీ

ములగాడ,పెన్ పవర్, జూలై 01 :

  కోరమాండల్ పరిసర గ్రామాల్లోని యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కోరమాండల్ ఇంటర్నేష నల్ లిమిటెడ్ సంస్థ ముందడుగు వేసింది. కంపె నీ పరిసర గ్రామాలకు చెందిన క్రికెట్ క్రీడాకారుల కు క్రికెట్ కిట్లను అందజేసింది.ములగాడ, ఎదురువాణిపాలెం, జాషువా కాల నీ, గోందేశివానిపాలెం, శ్రీరాంనగర్, పిలకవాణి పాలెం, గుల్లలపాలెం, కోడిపందాల దిబ్బ గ్రామా లకు చెందిన క్రీడాకారులకు మొత్తం 10 క్రికెట్ కిట్లను సంస్థ అధికారులు అందించారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని తెలిపారు. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్–హెచ్‌ఆర్ కె.వి.వి.ఎస్. నారాయణ చేతుల మీదుగా క్రీడాకారులకు ఈ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే సంస్థ లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ సి.ఎస్.ఆర్ మేనేజర్ శేషాపు వెంకటరమణ, సంస్థ వైద్యులు హేమంత్, ఉదయ్ పాల్గొన్నారు. క్రికెట్ కిట్లు అందుకో వడంతో గ్రామాల యువత,పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తూ కోరమాండల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular