తొలి ఏకాదశి సందర్భంగా పెందుర్తి వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 25 : తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు శనివారం కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర తిరుమలగా ప్రసిద్ధి చెందిన పెందుర్తి వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రమేష్ బాబు తీర్థప్రసాదాలు స్వీకరించి, ఆలయ ప్రధాన అర్చకుల ఆశీర్వాదాలు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నీలిమ, ఆలయ ప్రధాన అర్చకులు రామాంజనేయులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాజా సుధాకర్, కరణం కుమారస్వామి, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

