Homeతెలంగాణప్రారంభమైన ప్రజావాణి సమస్యలపై వినతుల వెల్లువ

ప్రారంభమైన ప్రజావాణి సమస్యలపై వినతుల వెల్లువ

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17:

గార్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, సంక్షేమ పథకాలు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీలు తదితర సమస్యలపై ప్రజలు వినతిపత్రాలను సమర్పించారు.ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ప్రజావాణిలో ప్రజాసంఘాల నాయకులు కోరారు . అధికారులు బాధితుల నుండి దరఖాస్తులు తీసుకొని రిజిస్టర్లో నమోదు చేసి దరఖాస్తుదారునికి ప్రత్యేక రసీదు అందజేశారు దరఖాస్తుదారులకు దరఖాస్తు నింపేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఎంపీడీవో మంగమ్మ ప్రత్యేక నోడల్ అధికారిగా వ్యవహరిస్తూ దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షించారు అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కేంద్రాలకు వెళ్లే పని లేకుండా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 46 దరఖాస్తులు అందాయనిప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి మంచి వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పరిష్కరించగల సమస్యలను స్థానికంగానే పరిశీలించి , ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో అధికారులకు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  23 శాఖల అధికారులలో తాసిల్దార్ శారద తో పాటుగా  డిప్యూటీ తాసిల్దార్ ఎంపీ ఓ ఏవో వెటర్నరీ ఎంఈఓ ఏపీఎం ఎస్సీ బీసీ ఎస్టీ ఆర్బి వెల్ఫేర్ ఫారెస్ట్ విద్యుత్ హౌస్ ఐ సి డి ఎస్ ఆర్ అండ్ బి మెడికల్ ఏ డిజి డబ్ల్యు ఓ ఇరిగేషన్ ఫిషరీస్ ఎస్ హెచ్ ఓ 21 మంది వివిధ శాఖల అధికారులు హాజరు కాగా రెండు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular