Homeతాజా సమాచారంగణేష్ లడ్డూను దక్కించుకున్న వేముల సుమన్ గౌడ్

గణేష్ లడ్డూను దక్కించుకున్న వేముల సుమన్ గౌడ్

 

హైదరాబాద్, పెన్ పవర్, సెప్టెంబర్ 21:

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని రాంనగర్ లో గల్లీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో గణనాథుడు విశేష పూజలు అందుకున్నాడు. ఉత్సవాలలో భాగంగా సోమవారం నిర్వహించిన గణనాథుడి చేతిలోని లడ్డూను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సుమన్ గౌడ్ దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకున్న వేముల సుమన్ గౌడ్, సౌమ్య దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుమన్ గౌడ్ మాట్లాడుతూ గణనాథుడి చేతిలోని లడ్డూను దక్కించుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల మోహన్ రెడ్డి, కొండ శివకుమార్, పెడకంటి విజయ్ కుమార్, కర్ణాటక నరసింహ, కొండ భాస్కర్, మేకల మహేందర్ రెడ్డి, తంగేళ్ల లింగస్వామి, గుత్తికొండ సతీష్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular