Homeతెలంగాణరంగారెడ్డిఅక్రమంగా చేపట్టిన రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోండి

అక్రమంగా చేపట్టిన రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్యలు తీసుకోండి

ఇబ్రహీంపట్నం, పెన్ పవర్, సెప్టెంబర్ 21:

ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించి, గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్న రీవేరా ఫంక్షన్ హాల్ పై చర్య తీసుకోవాలని ఉప్పరిగూడ గ్రామ ఉపసర్పంచ్ ఎన్ను కావ్య వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో వార్డు సభ్యులు నర్కుడి మహేందర్, కొంగరి రవితేజ తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం ఖల్సా (ఉప్పరిగూడ గ్రామం) రెవెన్యూ పరిధి, సీవిఆర్ కళాశాల సమీపంలో “రీవేరా ఫంక్షన్ హాల్” కు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని, పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు చెప్పిన పట్టించుకోకుండా, నిర్లక్ష్యం వహించారని అన్నారు. ఇటీవలా ఇదే అంశంపై ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాటి చర్యలు తీసుకోలేదన్నారు. కావున, ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ చేస్తూ, నడుపుతున్న ఈ రీవేరా పంక్షన్ హాల్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular