Homeఎడిటోరియల్కేజీబీవీ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

కేజీబీవీ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

  • గూడెంకొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 30: మండలంలోని డేరాల గ్రామంలో గల కేజీబీవీ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక తెలుగు వాడుక భాషా ఉద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌, తెలుగు ఉపాధ్యాయురాలు జి. విజయకుమారి,ఉపాధ్యాయులు,విద్యార్థులు పుష్పాంజలి ఘటించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం, విశిష్టత, ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు. తెలుగు భాషను పరిరక్షించడంతో పాటు దాని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న నానుడిని గుర్తుచేస్తూ తెలుగు భాష           మాధుర్యాన్ని,ప్రాశస్త్యాన్ని వివరించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పి. అప్పలమ్మ, ఎస్. పెద్దమ్మి, ఎం. పార్వతమ్మ, బి. లక్ష్మి, ఎం. ఉష, టి.శివప్రియ, టి.పద్మావతి,జి.ఎం.ఎం. రమ్య, ఈ. లక్ష్మి, ఎస్. శ్రీదేవి, బి. అనిత, బి. సత్యవతి, జి. పావని, కె. అరుణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular