Homeఎడిటోరియల్స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణం

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణం

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూల వాతావరణం

విశాఖలో పార్టీ మరింత బలోపేతం.. జగన్‌కు వివరించిన వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖ దక్షిణం, పెన్ పవర్, ఆగస్టు 20: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే అనుకూల పరిస్థితులు ఉన్నాయని విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు తాడేపల్లిలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసుపల్లి, విశాఖలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.

విశాఖ నగరంలో ప్రజా సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోరాటాలు, కూటమి ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను జగన్‌కు వివరించినట్లు వాసుపల్లి తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లో వైసీపీ బలంగా ఉందని, రానున్న స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

దక్షిణ నియోజకవర్గానికే పరిమితం కాకుండా విశాఖ నగరవ్యాప్తంగా ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వాసుపల్లి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని, ప్రభుత్వ విధానాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.

విశాఖలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్‌ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ అభినందించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని జగన్ పేర్కొన్నారని, కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పారని వాసుపల్లి వివరించారు.

రానున్నది వైసీపీ ప్రభుత్వమేనని జగన్ పేర్కొన్నట్లు వాసుపల్లి తెలిపారు. పార్టీ శ్రేణులు ప్రజా సమస్యలపై ప్రజల తరఫున నిరంతరం పోరాడాలని జగన్ పిలుపునిచ్చినట్లు చెప్పారు.

ఈ సమావేశంలో వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ లింగం శ్రీను, పచ్చరిపల్లి రాము, వార్డు అధ్యక్షులు దస్మాంతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, పినింట్ల రాజారెడ్డి, ముత్తాబత్తుల రమేష్, మహమ్మద్ షకీల్, గురజారపు రవి, ముజీబ్ ఖాన్, దస్మాంతుల సంతోషి, మాడుగుల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular