గార్ల, పెన్ పవర్,ఆగస్టు9:
సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలంతా సంఘ టితమవ్వాల్సిన అవసరం ఉందని ఆదివాసి అధ్యక్షులు ఎట్టి రాము అన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ తాసిల్దార్ కార్యాలయం ఎదుట గల కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించి ఆదివాసి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని సూచించారు. ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వట్టం లింగరాజు, ఇన్చార్జ్ హెచ్ఎం మోకాల రామచంద్రు, ఏటీఎఫ్ గార్ల మండల అధ్యక్షులు జబ్బా వీరస్వామి, వార్డు నెంబర్ కిన్నెర సాయి, ప్రధాన కార్యదర్శి కబ్బాకుల వెంకన్న, నాయక్ పోడు సంఘం బాధ్యులు కిన్నెర శ్రీనివాస్, ఆదివాసి ప్రధాన కార్యదర్శి పటేల్ తాటి రవి, తదితరులు పాల్గొన్నారు.

