నర్సీపట్నం, పెన్ పవర్ :
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు విజయ్ అండ చూసుకొని పేట్రేగిపోతున్న కొంతమంది టిడిపి నేతలకు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గొలుగొండ మండలం పాకలపాడులో వైయస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. 2029 ఎన్నికల్లో అక్కడ కౌంటింగ్ మొదలవగానే, నర్సీపట్నంలో శ్రుతి మించిన కొంతమంది టిడిపి నేతల కౌంటింగ్ మొదలవుతుందని హెచ్చరించారు. అలా చేయలేని పక్షంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉద్వేగంగా మాట్లాడారు.

