- గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగష్టు 28:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెదబరడ గ్రామానికి చెందిన పాంగి ఆనంద్‌కుమార్ నీట్ పరీక్షలో 499 మార్కులు సాధించి ఎస్టీ కేటగిరీలో రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంక్ సాధించాడు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించి వైద్య విద్యలో సీటు పొందడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.పాంగి బాబూరావు మాస్టర్, దేవుడమ్మ దంపతుల కుమారుడైన ఆనంద్‌కుమార్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కష్టపడి చదివి నీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ద్వారా వైద్య విద్యలో ప్రవేశం పొందడం అభినందనీయమన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్–ఉమామహేశ్వరి దేవి దంపతులు, కుటుంబ సభ్యులు ఆనంద్‌కుమార్‌ను దుశ్శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
నీట్‌లో ప్రతిభ.. ఎస్టీ కేటగిరీలో రాష్ట్ర 14వ ర్యాంక్:ఘనంగా సన్మానించిన వైసిపి నేత బొబ్బిలి లక్ష్మణ్
RELATED ARTICLES

