గార్ల, పెన్ పవర్, ఆగస్టు 6:
తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజు అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యార్థులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. విద్య, సమాజ అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీ కాంతారావు మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్టు 6న జన్మించి ఉపాధ్యాయుడిగా లెక్చలర్ గా యూనివర్సిటీ రిజిస్టార్ గా వైస్ చాన్స్ లర్ గా తెలంగాణ సిద్ధాంతకర్తగా తన సేవలను అందించారని కొనియాడారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నాగూర్, రామ్మోహన్ రావు, డాక్టర్ చార్లీ ,పున్నం చందర్ ,రాజేష్ ,డాక్టర్ సుందరయ్య, వీరన్న ,స్వరూప రాణి ,మేఘన ,లావణ్య వెంకటేశం, అనురాధ, సహన ,అధ్యాపకేతర సిబ్బంది వీరలక్ష్మి ,నాగేందర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

