Homeతెలంగాణహనుమకొండమున్నేరు బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం

మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 5:

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరుపై నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా, నీటిలోనే వాహనాలను నడుపుతూ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కొనసాగితే మున్నేరు నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular