గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17:
రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలం శెట్టి రమేష్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గార్ల మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఇచ్చే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేసి ఓట్లు దండుకుని అధికారానికి వచ్చిందని ఆరోపించారు. హైకోర్టు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకలపై స్టే విధించడం ముమ్మాటికి రేవంత్ రెడ్డి సర్కార్ అసమర్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని మహిళా లోకానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు ఆర్థిక భారంగా మారుతున్న నేపథ్యంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి జాప్యం లేకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బుడిగ మురళి కొండల్ నాగయ్య రాములు బాలు గడ్డం అశోక్ మీగడ శ్రీనివాస్ ఖదీర్ రెడ్డి మల్ల ఉమేష్ గద్దపాటి నరసింహ తాళ్లూరి అనిల్ శ్రీనాథ్ మహేష్ విజయ్ కుమార్ సలీం బండారి వెంకట్ బాలు రాందాసు వెంకటేశ్వర్లు విజయ్ వెంకటేష్ దేశపాక మురళి తదితరులు పాల్గొన్నారు.

