Homeతెలంగాణఖమ్మండోర్నకల్‌లో నేడు ‘నరేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్’ ప్రారంభం

డోర్నకల్‌లో నేడు ‘నరేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్’ ప్రారంభం

ఆధునిక ప్రింటింగ్ సేవలకు అందుబాటులో రెండో బ్రాంచ్

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 17:
గార్లతో పాటు డోర్నకల్ పట్టణ ప్రజలకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన ప్రింటింగ్ సేవలను అందించేందుకు ‘నరేష్ ఫ్లెక్స్ ప్రింటింగ్’ రెండో బ్రాంచ్ సోమవారం ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. డోర్నకల్ బ్యాంక్ స్ట్రీట్‌లోని న్యూ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు మద్దోజు నరేష్ తెలిపారు.
ఫ్లెక్స్ బ్యానర్లు, ఫోటో ఫ్రేమ్స్, మ్యాట్రిక్యులర్ ప్రింటింగ్, గిఫ్ట్ ఐటమ్స్, ఆల్బమ్స్, విజిటింగ్ కార్డులు, ఫంక్షన్ కార్డులు, ఇన్విటేషన్ కార్డులు, ప్రింట్‌అవుట్లు, వాల్ పోస్టర్లు, స్టిక్కర్లు తదితర ప్రింటింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటికే గార్లలో అందిస్తున్న సేవలను విస్తరించి డోర్నకల్ ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో రెండో బ్రాంచ్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అందుబాటు ధరల్లో నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి పట్టణ ప్రజలు, వ్యాపారులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular