Homeతెలంగాణఖమ్మంఘనంగా మూడవ వార్షికోత్సవం వేడుకలు

ఘనంగా మూడవ వార్షికోత్సవం వేడుకలు

 

ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 1:

పారదర్శకంగా భూముల వ్యాపారం చేసి మండలంలోని ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాలని ఖమ్మం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్‌ యూనియన్ అధ్యక్షుడు అంబాల వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ నగర్ లో రూరల్ ఏజెంట్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అంబాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో అంబాల కేక్ కట్ చేసి స్వీట్లు అందించారు. అనంతరం యూనియన్ బలోపేతం, సభ్యుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఏజెంట్స్ ని నమ్ముకుని వచ్చే కస్టమర్ల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సెక్రటరీ పసుపులేటి వెంకట్, కోశాధికారి మల్లాది మల్లయ్య, అధ్యక్షుడు బీ సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, నాయకులు సునీల్, పాండు, హుస్సేన్, సుమన్, రాధాకృష్ణ, లింగయ్య, నరేందర్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular