Homeఆంధ్రప్రదేశ్బాపట్లవినాయక నిమజ్జనం నుంచి వస్తూ విషాదం

వినాయక నిమజ్జనం నుంచి వస్తూ విషాదం

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి

కారంచేడు, సెప్టెంబర్ 20 (పెన్ పవర్): వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న ఇద్దరు వ్యక్తులను రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలోని వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి -167ఎ పై ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

స్థానికుల వివరాల ప్రకారం.. పర్చూరు మండలం, బోడవాడ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వినాయక నిమజ్జన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తికి గాయాలైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని సంతోషంగా ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో బోడవాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular