Homeతెలంగాణక్రీడా పోటీలలో గెలుపు ఓటమి సహజం

క్రీడా పోటీలలో గెలుపు ఓటమి సహజం

 

గార్ల, పెన్ పవర్ ,సెప్టెంబర్ 9:

క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి సహజమని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పార్వతి నాయక్ ఎస్ఐ సాయికుమార్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని పానిక జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ 14 17 విద్యార్థిని విద్యార్థులకు ఖోఖో వాలీబాల్ కబడ్డీ మండల స్థాయి పాఠశాల క్రీడలు నిర్వహించారు. కబడ్డీలో సీనియర్స్ ఆశ్ర మ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలుపొందగా విశ్వశాంతి విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. జూనియర్స్ కబడ్డీలో విభాగంలో విశ్వశాంతి విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా కేజీబీవీ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఖోఖో ఆటలో సీనియర్ విభాగంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలుపొందగా పుల్లూరు పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు ఖోఖో జూనియర్స్ విభాగంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలుపొందగా సీతంపేట పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు వాలీబాల్ ఆట సీనియర్ విభాగంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో గెలుపొందిగా పుల్లూరు పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు.ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు గోపాలపురం హై స్కూల్ హెచ్ఎం మోకాళ్ళ రామచంద్రు తన భార్య జ్ఞాపకార్థం బహుకరించిన బహుమతులు షీల్డ్ లను ఎస్సై సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపోటములు సహజమని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఓటమితో క్రీడాకారులను నిరుత్సాహానికి గురికాకుండా గెలుపొందెందుకు కృషి చేయాలన్నారు క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు శివ నాయక్ ఎంఈఓ వీరభద్రం హెచ్ఎం పద్మావతి పీడీలు శీను పద్మ శంకర్ నాగేష్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular