Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురింతాడ–2 జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా గబులంగి గణేష్ నామినేషన్

రింతాడ–2 జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా గబులంగి గణేష్ నామినేషన్

అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడ–2 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గబులంగి గణేష్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎబులం గ్రామానికి చెందిన గణేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబు నాయక్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గబులంగి గణేష్‌కు మద్దతు తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular