Homeఆంధ్రప్రదేశ్కాకినాడకాజులూరు మండలంలో ప్రత్యేక అధికారి సమీక్ష

కాజులూరు మండలంలో ప్రత్యేక అధికారి సమీక్ష

ఎన్నికల నిర్వహణతో పాటు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

కాజులూరు, సెప్టెంబర్ 26 పెన్ పవర్: కాజులూరు మండల ప్రత్యేక అధికారిగా నియమితులైన డ్వామా పీడీ ఎస్. మధుసూదన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్యాలయానికి చేరుకున్న ప్రత్యేక అధికారికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు, కార్యాలయ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం మండల పరిధిలోని అన్ని గ్రామాల పరిస్థితులు, పోలింగ్ బూత్‌ల వివరాలను ప్రత్యేక అధికారి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో వైద్య సహాయం, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు, పరిపాలనాధికారి పద్మలత, డిప్యూటీ ఎంపీడీవో ఎం. సత్యనారాయణమూర్తి, కార్యాలయ సిబ్బంది, వీబీజీ రాంజీ, కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular