*స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం.
*వెన్నుపోటు ప్రభుత్వం-వెన్నుపోటు పాలనపై పోరు.
*గిరిబాబు ఆధ్వర్యంలో భద్రవరం మాజీ సర్పంచ్ కూనపురెడ్డి సుబ్బారావు జనసేన నుండి సుమారు 100 కుటుంబాలతో వైసీపీలో చేరిక.
ఏలేశ్వరం, పెన్ పవర్, సెప్టెంబర్ 22: ఏలేశ్వరంలో ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం వేదిక ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి యువజన విభాగం అధికార ప్రతినిధి బదిరెడ్డి గోవింద్ సతీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి దివంగత నేత ముద్రగడ పద్మనాభం తనయుడు ముద్రగడ గిరిబాబు తొలిసారిగా పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ప్రారంభంలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి గిరిబాబు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. పద్మనాభం పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు సభలో వైసీపీ శ్రేణులు మౌనం పాటించాయి. అనంతరం ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు వైసీపీలో చేరారు. ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ కూనపు రెడ్డి సుబ్బారావు ఆయన కుమారుడు దుర్గారావు లతో పాటు సుమారు 100 కుటుంబాలు సభ వేదికపై వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముద్రగడ గిరిబాబు వారికి వైసిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి నాయకులు కార్యకర్తలతో ప్రతిపాడు నియోజకవర్గస్థాయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు సభ్యత్వ కార్డులను గిరిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలని,
వెన్నుపోటు ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై పోరుకు సిద్ధం కావాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు , హామీలు నెరవేర్చని వెన్నుపోటు ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు అన్నారు. ఏ కష్టం వచ్చినా పార్టీ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని గిరిబాబు భరోసా ఇచ్చారు.ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ల గడుస్తున్నా ఇప్పటివరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని గిరిబాబు అన్నారు.

ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి జమీలు,జడ్పీటీసీలు బెహరా రాజేశ్వరి,గొల్లు చిన్న దివానం,మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి,రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి అడపా సోమేశ్,శెట్టిబత్తుల కుమార్ రాజా,ఏలేశ్వరం వైసిపి పట్టణ అధ్యక్షుడు శిడగం వెంకటేశ్వరరావు ,రూరల్ గొల్లపల్లి సురేష్ ప్రత్తిపాడు,శంఖవరం మండల పార్టీ అధ్యక్షులు రామిశెట్టి నాని,నరాల శ్రీను,నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు పలివెల నాగేంద్ర,నాయకులు గొల్లపల్లి కాశీ విశ్వనాధ్,గొల్లపల్లి దొరబాబు,బీశెట్టి అప్పలరాజు, అలమండ నాగేంద్ర కుమార్, రెడ్డి నాగు,సుంకర రాంబాబు,సామంతుల సూర్యకుమార్, రాచర్ల రమేష్, నోముసు మధు, సంకురు గుర్రాజు,గుడాల వెంకటరత్నం,గౌతు స్వామి,దళే చిట్టిబాబు,గొంతిరెడ్డి సతీష్,చిలకమర్తి వెంకటరమణ,ఓలేటి చంటిబాబు,దాడిశెట్టి చక్రధర్,యిజనగిరి శివ ప్రసాద్,బంక్ శ్రీను,గుమ్ములూరి వెంకట రమణ,సఖిరెడ్డి బుజ్జి, సోమరౌతు వివేక్,రామకుర్తి సత్యరాజా,పెయ్యల రాజా,సిరిపురపు రాజేష్,దత్తి రాజా,బీసెట్టి రాజా,బంటుపల్లి శ్రవణ్ , నియోజకవర్గంలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

