Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుకాలువ దాటాలంటే సాహసమే!:బత్తునూరు కాలువపై బ్రిడ్జి నిర్మించండి

కాలువ దాటాలంటే సాహసమే!:బత్తునూరు కాలువపై బ్రిడ్జి నిర్మించండి

గూడెం కొత్త వీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 12: జీకే వీధి మండలం గాలికొండ పంచాయతీలోని బత్తునూరు కాలువ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాలువ అవతల ఉన్న లేతమర్రి, మైనకోట, బుగ్గిరాయి, పాత్రునిగుంట తదితర గ్రామాల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అత్యవసర వైద్యం, నిత్యావసర సరుకుల కోసం సప్పర్ల గ్రామానికి రావాల్సి ఉండగా, కాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం సప్పర్ల సంతకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బత్తునూరు కాలువపై బ్రిడ్జి నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా అధికారులకు, ప్రభుత్వాలకు విన్నవిస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెంటనే బ్రిడ్జి నిర్మించి శాశ్వతంగా రాకపోకల సమస్యను పరిష్కరించాలని గాలికొండ పంచాయతీ గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular