Homeఆంధ్రప్రదేశ్కాకినాడరోగుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం : జేసీ

రోగుల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం : జేసీ

కాజులూరు, పెన్ పవర్,సెప్టెంబర్ 11:
ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కాజులూరు మండలం గొల్లపాలెం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని
శుక్రవారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పీహెచ్‌సీలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను తనిఖీ చేసిన జేసీ.. అవుట్‌పేషెంట్ విభాగానికి వచ్చిన రోగులతో స్వయంగా మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు రోగులను శ్రద్ధగా పరీక్షిస్తున్నారా, ప్రాథమిక వైద్య పరీక్షలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలను నేరుగా రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు,ఫార్మసీ, ఇతర పారామెడికల్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆసుపత్రి హాజరు పట్టికలు, రోగుల రిజిస్టర్లు, ఔషధాల నిల్వలు, ఇతర రికార్డులను జేసీ పరిశీలించారు. ఫార్మసీలో మందుల పంపిణీ విధానం, గడువు ముగిసిన మందులు ఉన్నాయా అనే అంశాలను తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాల్లోని మరుగుదొడ్ల పారిశుద్ధ్యం,తాగునీరు, ఇతర మౌలిక వసతులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆరోగ్య భరోసా కేంద్రాలని పేర్కొన్నారు. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల సిబ్బంది సానుకూలంగా స్పందించాలని సూచించారు. వైద్య సేవల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా రోగుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.ఈ తనిఖీలో ఎంపీడీవో జె.రాంబాబు,డీఐవో డా.సుబ్బరాజు, డాక్టర్.శ్రేయ,పంచాయతీ కార్యదర్శి పీహెచ్ సూర్యప్రకాష్,పి.భాగ్యవతి,స్థానికవైద్యఅధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular