Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఇంటి గోడ కూలి తప్పిన పెను ప్రమాదం

ఇంటి గోడ కూలి తప్పిన పెను ప్రమాదం

గూడెం కొత్త వీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 12: జీకేవీధి మండలంలోని ధారకొండ పంచాయతీ పెబ్బంపల్లిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శనివారం గిరిజనుడు చిలకల లక్ష్మణరావుకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇంటి గోడలు కూలిపోవడంతో కుటుంబం నిరాశ్రయులైంది. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని లక్ష్మణరావు కుటుంబం కోరుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular