Homeఆంధ్రప్రదేశ్గుంటూరుగుంటూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

గుంటూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

గుంటూరులో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, పెన్ పవర్ సెప్టెంబర్ 18:

గుంటూరులోని సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్ శాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ అలీమ్, ఎం.ఆర్.కె. పరమహంస, మాగంటి సుధాకర్, సమర్థనం ట్రస్ట్ బెంగళూరు ప్రధాన కార్యాలయం నుంచి సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు నరేంద్ర మోదీ నాయకత్వం, దార్శనికత, మైనారిటీ వర్గాల సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతతో పాటు దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. సమర్థనం ట్రస్ట్ సిబ్బంది, విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular