చీరాల, సెప్టెంబర్ 27 : వాడరేవు–పిడుగురాళ్ల హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల నుంచి వాడరేవు బీచ్‌కు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరీష్‌తో పాటు నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్టీరింగ్ పట్టివేయడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.

